Wednesday, January 1, 2025

ఐపిఎల్ షెడ్యూల్‌లో మార్పు

- Advertisement -
- Advertisement -

BCCI Announces Schedule for IPL 2022 Playoffs

ముంబై: ఐపిఎల్ టి20 లీగ్‌లో బిసిసిఐ స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్‌కు చేరుకోగా మరో మూడు టీమ్‌లు ఆ స్థానం కోసం పోరాడుతున్నాయి. కాగా, తొలి క్వాలీఫయర్ మ్యాచ్ మే 24న, ఎలిమినేటర్ మ్యాచ్ 25న జరగనుండగా, ఇక రెండో క్వాలీఫయర్ మ్యాచ్ 27న ఫైనల్ మ్యాచ్29న నిర్వహించనున్నారు. అయితే ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎలిమినేటర్ మ్యాచ్ 26 జరగాల్సి ఉండగా దానిని ఒక రోజు పోస్ట్‌పోన్ చేస్తూ బిసిసిఐ రీ షెడ్యూల్ చేసింది. తొలి క్వాలీఫయర్ మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికవనుండగా.. రెండో క్వాలీఫయర్ మ్యాచ్, ఫైనల్ ఆహ్మదాబాద్‌లోని అతిపెద్ద స్టేడియమైన మొతెరాలో నిర్వహించనున్నారు. కాగా, ప్రస్తుతం లీగ్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి.

BCCI Announces Schedule for IPL 2022 Playoffs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News