Monday, December 23, 2024

క్రికెట్ అభిమానులకే పండగే..

- Advertisement -
- Advertisement -

క్రికెట్ అభిమానులకే పండగే..
స్వదేశంలో భారత్ ఫుల్ బిజీ
షెడ్యూల్ ప్రకటించిన బిసిసిఐ
ముంబై: వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పలు సిరీస్‌లు జరుగనున్నాయి. సొంత గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో భారత్ తలపడనుంది.ఈ సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. మూడు నెలల వ్యవధిలో భారత్ నాలుగు టెస్టులు, 9 వన్డేలు, మరో ఆరు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలుత శ్రీలంకతో మూడు వన్డేలు, మరో 3 టి20 మ్యాచుల్లో భారత్ తలపడనుంది. జనవరి 3 నుంచి 15 వరకు ఈ సిరీస్‌లు జరుగనున్నాయి. జనవరి 3న ముంబై, ఐదు పుణె, జనవరి ఏడున రాజ్‌కోట్ వేదికలుగా టి20 మ్యాచులు జరుగుతాయి.

ఇక జనవరి 10న గౌహతిలో తొలి వన్డే, 12న కోల్‌కతాలో రెండో వన్డే, 15న త్రివేండ్రంలో మూడో వన్డే మ్యాచ్ నిర్వహిస్తారు. ఈ సిరీస్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు ఈ సిరీస్ జరుగనుంది. ఇందులో కూడా మూడు వన్డేలు మరో 3టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 9 నుంచి మార్చి 22 వరకు ఆస్ట్రేలియాతో భారత్ సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు జరుగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News