Thursday, January 16, 2025

టీమిండియా జట్ల ఎంపిక.. తొలి వన్డేకు రోహిత్ దూరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టులు, మరో మూడు వన్డేల కోసం ఆదివారం టీమిండియాను ఎంపిక చేశారు. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టుల కోసం పాత జట్టునే కొనసాగించాలని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) నిర్ణయించింది. అయితే వైస్ కెప్టెన్ పదవి నుంచి కెఎల్ రాహుల్‌ను తొలగించింది.

తొలి రెండు టెస్టుల్లో రాహుల్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు. ఇక తొలి వన్డేకు రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నాడు. అతని స్థానంలో మొదటి వన్డేకు హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తాడు. మొదటి వన్డే మార్చి 17న ముంబైలో జరుగనుంది. రెండో వన్డే మార్చి 19న విశాఖపట్నంలో, చివరి వన్డే మార్చి 22న చెన్నైలో జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News