Monday, December 23, 2024

కివీస్, బంగ్లాదేశ్ సిరీస్‌లకు టీమిండియా ఎంపిక

- Advertisement -
- Advertisement -

BCCI Announces Squads for New Zealand and Bangladesh

న్యూఢిల్లీ: న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో జరిగే సిరీస్‌లకు టీమిండియాను ఎంపిక చేశారు. భారత సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ జట్టు వివరాలను వెల్లడించారు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌లో భారత జట్టు పర్యటించనుంది. సిరీస్‌లో భాగంగా మూడు టి20లు, మరో 3 వన్డే మ్యాచ్‌లను భారత్ ఆడనుంది. ఇక సిరీస్‌లో పాల్గొనే వన్డే జట్టుకు శిఖర్ ధావన్, టి20 జట్టుకు హార్దిక్ పాండ్య కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు, వన్డే సిరీస్‌లకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడు. రెండు సిరీస్‌లలో కెఎల్. రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. నవంబర్ 18 నుంచి 30 వరకు కివీస్ సిరీస్ జరుగనుంది. కివీస్ సిరీస్‌కు రోహిత్, కార్తీక్, కోహ్లి, అశ్విన్, రాహుల్ దూరంగా ఉండనున్నారు.
జట్ల వివరాలు:
కివీస్‌తో టి20 సిరీస్‌కు
హార్దిక్ పాండ్య (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, చాహల్, కుల్దీప్, హర్షల్ పటేల్, సిరాజ్, భువనేశ్వర్, అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్.
వన్డే సిరీస్‌కు
శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్, హూడా, సూర్యకుమార్, శ్రేయస్, సంజు శాంసన్, సుందర్, శార్దూల్, షాబాబ్ అహ్మద్, చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్, దీపక్. కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
బంగ్లాదేశ్‌తో టెస్టులకు
రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్, పుజారా, కోహ్లి, శ్రేయస్, రిషబ్, భరత్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్, శార్దూల్, షమి, సిరాజ్, ఉమేశ్ యాదవ్.
వన్డేలకు
రోహిత్ (కెప్టెన్), రాహుల్, శిఖర్, కోహ్లి, రజత్ పటిదార్, శ్రేయస్, రాహుల్ త్రిపాఠి, జడేజా, అక్షర్, సుందర్, ఇషాన్, శార్దూల్, సిరాజ్, షమి, దీపక్, యశ్ దయాళ్.

BCCI Announces Squads for New Zealand and Bangladesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News