Thursday, January 23, 2025

మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టు ప్రకటన.. అయ్యర్ పై వేటు!

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌-భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్‌ జరుగతుంది. ఇందులో భాగంగా జరిగిన రెండు టెస్టు మ్యాచ్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ సిరీస్ కు తొలి రెండు టెస్టులకు మాత్రమే బిసిసిఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మిగిలిన మూడు టెస్టు మ్యాచ్ లకు టీమిండియాను ప్రకటించింది. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.

అయితే, తొలి రెండు టెస్టుల్లో ఆడిన శ్రేయస్ అయ్యర్ పై సెలక్షన్ కమిటీ వేటు వేసినట్లు తెలుస్తోంది. గాయ కారణంగా అయ్యర్ ను ఎంపిక చేయలేదని బిసిసిఐ వర్గాలు చెబుతున్నప్పటికీ.. రెండు టెస్టుల్లో విఫలం కావడంతోనే అయ్యర్ ను పక్కనపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండో టెస్టుకు దూరమైన కెఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజాలు తిరిగి జట్టులోకి వచ్చారు. పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ ను కూడా ఎంపిక చేశారు. కాగా, మూడో టెస్టు ఈ నెల 15వ తేదీన ప్రారంభం కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News