- Advertisement -
ముంబై: ఆసియాకప్‌లో పాల్గొనే టీమిండియాను సోమవారం ఎంపిక చేశారు. ఇటీవల విండీస్‌తో జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి చేరాడు. అతనితో పాటు కీలక ఆటగాడు కెఎల్.రాహుల్ కూడా జట్టుకు ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. అతనికి జట్టులో చోటు దక్కలేదు. మరో బౌలర్ హర్షల్ పటేల్ కూడా గాయంతో ఆసియా కప్ నుంచి వైదొలిగాడు. ఇటీవల వరుస వైఫల్యాలు చవిచూస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు కూడా చోటు దక్కలేదు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ దక్కింది.
BCCI Announces Team for Asia Cup 2022
- Advertisement -