Sunday, December 22, 2024

టీ20 ప్రపంచకప్‌: భారత జట్టు ప్రకటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టును బీసిసిఐ ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును బిసిసి ప్రకటించింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ లో గాయపడిన ఆల్ రౌండర్ రవీంద్ర జాడేజా కోలుకోకపోవడంతో అతనిని ఎంపిక చేయలేదు. ఇక, పేసర్ బస్ప్రీత్ బుమ్రాతోపాటు హర్షల్ పటేల్ ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఆసియా కప్ లో దారుణంగా విఫలమైన దీపక్ హుడాకు మరో అవకాశం ఇస్తూ ఈ మెగా టోర్నీకి ఎంపిక చేశారు. ఇక, ఆసియా కప్ లో చోటు దక్కని మహ్మద్‌ షమీతోపాటు శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్, దీపక్‌ చాహర్‌ లను స్టాండ్ బై ప్లేయర్ లు గా ఎంపిక చేశారు. కాగా, అక్టోబర్ 16 నుంచి నవంబరు 13 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో మొత్తం 45 మ్యాచ్‌లు జరగనున్నాయి.

టీమిండియా: రోహిత్‌(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, విరాట్‌, పంత్‌, సూర్యకుమార్, హార్దిక్‌, దీపక్‌ హుడా, అశ్విన్‌, చాహల్‌, దినేశ్‌ కార్తిక్‌, అక్షర్‌ పటేల్‌, బుమ్రా, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

స్టాండ్‌ బై ప్లేయర్స్‌: మహ్మద్‌ షమీ, శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్, దీపక్‌ చాహర్‌

BCCI Announces team for ICC T20 World Cup

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News