Friday, November 22, 2024

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కు భారత జట్టు ప్రకటన

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది.ఈ నెల 18 నుంచి ఇంగ్లండ్ లో సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని 15మంది సభ్యులతో కూడిన భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లను ఎంపిక చేసింది. మరోవైపు, ఇంగ్లండ్ జట్టును వారి సొంతగడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ జట్టు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో టీమిండియాను ఢీకొట్టేందుకు సిద్ధమైంది.

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభమన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానె(వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్, సాహా, అశ్విన్, జడేజా, బుమ్రా, షమీ, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

BCCI Announces Team for ICC WTC Final 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News