ఐర్లాండ్ సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్
రాహుల్ త్రిపాఠి, శాంసన్‌కు చోటు
ముంబై: ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు టీమిండియాను ప్రకటించారు. సిరీస్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్య సారథ్యం వహిస్తాడు. ఇక సీనియర్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. మరోవైపు ఐపిఎల్‌లో అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠికి టీమిండియాలో తొలిసారి చోటు దక్కింది. సంజు శాంసన్ కూడా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. రిషబ్ పంత్‌తో సహా పలువురు సీనియర్లకు సిరీస్‌లో విశ్రాంతి ఇచ్చారు. ఈ నెల 26, 28 తేదీల్లో ఐర్లాండ్ వేదికగా సిరీస్ జరుగనుంది. దీని కోసం 17 మందితో కూడిన టీమ్‌ను సెలెక్టర్లు బుధవారం ప్రకటించారు. ఇక సిరీస్‌లో వివిఎస్.లక్ష్మణ్ భారత జట్టు ప్రధాన కోచ్ వ్యవహరించనున్నాడు.
జట్టు వివరాలు: హార్దిక్ పాండ్య (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), చాహల్, అక్షర్, రవి బిష్ణోయి, హర్షల్, అవేశ్, అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్.
BCCI Announces Team for T20 Series against Ireland