ముంబై: జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనే టీమిండియాను బిసిసిఐ శనివారం ప్రకటించింది. ఆగస్టులో జింబాబ్వే గడ్డపై మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం 15 మందితో కూడిన జట్టును సెలెక్టర్ల బృందం ఎంపిక చేసింది. ఈ సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్లు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, భువనేశ్వర్, బుమ్రా, షమి తదితరులకు విశ్రాంతి ఇచ్చారు. సిరీస్ కోసం యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు. రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్‌లకు తిరిగి టీమిండియాలో చోటు దక్కింది. సంజు శాంసన్ కూడా జట్టులో స్థానం నిలబెట్టుకున్నాడు.
జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్.
BCCI Announces Team for Zimbabwe Tour