- Advertisement -
వన్డే ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచి ఉత్సాహంతో స్వదేశానికి తిరిగొచ్చిన టీమిండియా ఆటగాళ్లు ఐపిఎల్ బరిలోకి దిగారు. ఐపిఎల్ కారణంగా బిసిసిఐ ఎలాంటి సిరీస్ లను ప్రకటించలేదు. ప్రస్తుతం భారత ఆటగాళ్లందరూ ఐపిఎల్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ మెగా టోర్నమెంట్ అనంతరం భారత జట్టు ఈ ఏడాది స్వదేశంలో ఆడబోయే సిరీస్ ల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం బిసిసిఐ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. 2025 అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో టీమిండియా రెండు టెస్టులు (అహ్మదాబాద్, కోల్‌కతా) ఆడనుంది. ఆ తర్వాత నవంబర్-డిసెంబర్‌లో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
- Advertisement -