Monday, December 23, 2024

వన్డే ప్రపంచకప్ 2023కు భారత జట్టు ప్రకటన..

- Advertisement -
- Advertisement -

ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 మెగా టోర్నమెంటులో పాల్గొనే భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. మంగళవారం భారత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ శ్రీలంక నుంచి 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ప్రకటించారు. ఆసియా కప్ లో భాగంగా ప్రస్తుతం భారత జట్టు శ్రీలంకలో ఉన్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ భారత జట్టుకు రోహిత్ శర్మకే సారథ్య బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్ గా హర్ధిక్ పాండ్యాను కొనసాగించారు. చాలా రోజులు జట్టుకు దూరంగా ఉన్న కెఎల్ రాహుల్ ను ప్రపంచకప్ కు ఎంపిక చేశారు.

భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హర్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, మహ్మద్ షమీ, మహమద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News