Wednesday, December 25, 2024

టీమిండియా ప్లేయర్లకు బిసిసిఐ గుడ్ న్యూస్

- Advertisement -
- Advertisement -

టీమిండియా ప్లేయర్లకు బిసిసిఐ గుడ్ న్యూస్ చెప్పింది. టెస్టు క్రికెట్ ఆడే సీనియర్ మెన్స్ ప్లేయర్లకు ఫీజులను భారీగా పెంచింది. ఇందుకోసం బిసిసిఐ ‘టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్‌ స్కీమ్‌’ను తీసుకొచ్చింది. ప్రస్తుతం టెస్టు క్రికెట్ ఆడే ఒక్కో ప్లేయర్ కు రూ.15 లక్షలు మ్యాచ్ ఫీజు ఇస్తున్నారు. తాజా స్కీమ్ తో ఒక్కో టెస్టు మ్యాచ్ కు రూ.45 లక్షల ఫీజు ఇవ్వనుంది.

అయితే, ఒక సీజన్ లో 75 శాతం కంటే ఎక్కువ గేమ్ లు ఆడిన వారికి మాత్రమే ఈ మొత్తాన్ని ఇస్తారు. 50 శాతం మ్యాచ్ లు ఆడిన వారికి రూ.30 లక్షలు చెల్లిస్తారు.ఇక, తుది జట్టులో చోటు దక్కని ప్లేయర్లకు మొత్తం ఫీజులో సంగం ఇస్తారు. ఈ కొత్త స్కీమ్ 2022-23 సీజన్ నుంచి ప్రారంభమవుతుందని బిసిసిఐ కార్యదర్శి జై షా ట్విటర్ ద్వారా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News