Wednesday, December 25, 2024

జింబాబ్వే టూర్.. టీమిండియాలో మార్పులు

- Advertisement -
- Advertisement -

ముంబై: జింబాబ్వేతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం ప్రకటించిన టీమిండియాలో బిసిసిఐ పలు మార్పులు చేసింది. జులై ఆరు నుంచి 14 వరకు జింబాబ్వే వేదికగా ఈ సిరీస్ జరగాల్సి ఉంది. ఈ పర్యటన కోసం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును జట్టును బిసిసిఐ ఇప్పటికే ప్రకటించింది.

కానీ ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఆటగాళ్లు బెరిల్ హరికేన్ ప్రభావంతో బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. దీంతో జింబాబ్వే సిరీస్ కోసం ఎంపిక చేసిన సంజూ శాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్‌లు కూడా బార్బడోస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో తొలి రెండు టి20ల కోసం జట్టులో పలు మార్పులు చేశారు. శాంసన్, దూబె, జైస్వాల్‌ల స్థానంలో ఇతర ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను వీరి స్థానంలో జట్టులోకి చోటు కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News