Monday, December 23, 2024

ఆ నిర్ణయం అగార్కర్‌దే..

- Advertisement -
- Advertisement -

బిసిసిఐ కార్యదర్శి జై షా

ముంబై: ఇటీవల భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ప్రకటించిన సెంట్రల్ క్రాంటాక్ట్‌లలో స్టార్ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లకు చోటు దక్కని విషయం తెలిసిందే. టీ మిండియాలో కీలక ఆటగాళ్లుగా ఉన్న వీరిద్దరికి సెంట్రల్ కాంట్రాక్ట్‌లు దక్కక పోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా దీని పై బిసిసిఐ కార్యదర్శి జై షా స్పందించారు. శ్రేయస్, ఇషాన్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్‌లు దక్కక పోవడానికి తనకు ఎలాంటి సంబం ధం లేదన్నారు. బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకున్న నిర్ణయం వల్లే వీరికి కాం ట్రాక్ట్‌లు దక్కలేదని పేర్కొన్నారు.

క్రికెటర్లకు కేటాయించే సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో బిసిసిఐకి ఎలాంటి సంబంధం ఉండదన్నా రు. జట్టు ఎంపిక, కాంట్రాక్ట్‌ల కేటాయింపు తదితర విషయాల్లో బిసిసిఐ అధ్యక్ష, కార్యదర్శులకుగానీ ఇతర ప్రతినిధుల పాత్ర ఉండదని వివరించారు. ఇషాన్, శ్రేయస్ కాంట్రాక్ట్ పొడిగింపు విషయంలో చీఫ్ సెలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు ఆసక్తి చూపక పోవడం, బో ర్డు ఆదేశాలను పట్టించుకోక పోవడం వల్లే అ గార్కర్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నార ని జైషా స్పష్టం చేశారు. కాగా, ప్రతి క్రికెటర్ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని, ఈ విషయంలో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలకు సయితం బోర్డు వెనకాడబోమని పేర్కొన్నారు.

త్వరలో కొత్త కోచ్ ఎంపిక

టీమిండియా ప్రధాన కోచ్‌కు సంబంధించి కూడా జైషా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం టీమిండియా కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ ఇప్పటికే ముగిసిందన్నారు. అయితే వరల్డ్‌కప్ వరకు ద్రవిడ్‌నే కోచ్‌గా కొనసాగించాలని నిర్ణయించామన్నారు. కాగా, కొత్త కోచ్ కోసం త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానిస్తామన్నారు. ద్రవిడ్ కూడా మరోసారి కోచ్ పదవీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపా రు. కాగా, కొత్త కోచ్ భారత్ నుంచి ఉంటా డా, విదేశీ కోచ్‌ను తీసుకోవాలా అనేది ఇప్పు డే చెప్పలేమన్నారు. క్రికెట్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేగాక ఇంపాక్ట్ రూల్‌పై కూడా సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ విధానాన్ని కొనసాగించాలా లేదా అనే దాని పై కూడా అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని జైషా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News