Saturday, December 21, 2024

యువ టీమ్‌కు ఘన సత్కారం.. రూ.కోట్లు నజరానా

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఇటీవల సౌతాఫ్రికా వేదికగా జరిగిన మహిళల అండర్19 టి20 ప్రపంచకప్‌లో ట్రోఫీని గెలుచుకున్న భారత యువ టీమ్‌కు బుధవారం అహ్మదాబాద్‌లో ఘన సన్మానం జరిగింది. భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో యువ టీమ్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సచిన్ యువ క్రికెటర్లతో ముచ్చటించాడు.

వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చాడు. భవిష్యత్తుల్లో మరింత మెరుగైన ప్రదర్శనతో అలరించాలని సూచించాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో విజేత నిలువడం ద్వారా భారత యువ టీమ్ చరిత్ర సృష్టించిందన్నాడు. ఈ విజయం మహిళా క్రికెట్‌లో కొత్త జోష్‌ను నింపడం ఖాయమన్నాడు. ఇదిలావుంటే విశ్వవిజేత టీమ్‌కు బిసిసిఐ ఐదు కోట్ల రూపాయల నగదు నజరానాను బహుమతిగా అందజేసింది. ఈ కార్యక్రమంలో బిసిసిఐ కార్యదర్శి జైషా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News