Monday, December 23, 2024

రవీంద్ర జడేజాపై బిసిసిఐ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: మోకాలకు గాయకావడంతో ఆసియా కప్ మధ్యలో నుంచి ఆల్‌రౌండర్ క్రికెటర్ రవీంద్ర జడేజా వైదొలిగాడు. దీనిపై బిసిసిఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. జడేజా కోలుకొని త్వరలో జరిగే టి-20 ప్రపంచ కప్‌కు అందుబాటులోకి రావడం కష్టమేనని వైద్యులు సూచిస్తున్నారు. దుబాయ్‌లోని సముద్ర తీరంలో స్కై బోర్డుపై విన్యాసాలు చేస్తుండగా అతడు మోకాలుకు తీవ్రమైన దెబ్బతగిలింది. ఓ కాంట్రాక్ట్ ప్లేయర్ ఇలా సంబంధంలేని ఆటలో పాల్గొని తీవ్రంగా గాయపడడంపై బిజెపి ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మైదానం బయట గాయపడడంతో అతడిపై అధికారులు ఆగ్రహం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News