Friday, November 22, 2024

దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌ల ఫీజు పెంపు

- Advertisement -
- Advertisement -

BCCI hikes match fee for domestic players

 

ముంబై: దేశవాళీ టోర్నమెంట్‌లలో పాల్గొనే క్రికెటర్లకు మ్యాచ్ ఫీజును పెంచుతున్నట్టు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జై షా ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఇకపై 40 మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడిన సీనియర్ ఆటగాళ్లకు రూ.60 వేలు, అండర్23 ఆటగాళ్లకు రూ.25 వేలు, అండర్19 క్రికెటర్లకు రూ.20 వేలు చొప్పున మ్యాచ్ ఫీజుగా చెల్లించనున్నట్టు జై షా వెల్లడించారు. సోమవారం జరిగిన బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక కరోనా కారణంగా కోల్పోయిన కిందటి సీజన్‌కు గానూ క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులో 50 శాతం పరిహారం కింద ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 201920 దేశవాళీ క్రికెట్ సీజన్‌లో పాల్గొన్న ఆటగాళ్లకు ఈ పరిహారం అందిస్తామన్నారు. కాగా కరోనా కారణంగా కిందటి ఏడాది రంజీ ట్రోఫీని పూర్తిగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా ప్రస్తుతం రంజీ లేదా విజయ్ హజారే ట్రోఫీలలో ఆడే క్రికెటర్లకు మ్యాచ్‌కు రూ.35 వేల చొప్పున చెల్లిస్తున్నారు. అంతేగాక ముస్తాక్ అలీ ట్రోఫీకి ప్రతి మ్యాచ్‌కు రూ.17500 చొప్పున అందిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది దేశవాళీ సీజన్‌కు అక్టోబర్ 20 నుంచి జరిగే ముస్తాక్ అలీ ట్రోఫీతో తెరలేవనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News