Friday, December 20, 2024

బిసిసిఐకి ట్విట్టర్ షాక్

- Advertisement -
- Advertisement -

ముంబై : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాటను ఆచరణలో పెట్టినందుకు బ్లూ టిక్స్‌ను కోల్పోవలసి వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు తమ డిసిని త్రివర్ణ పతాకంతో ఉంచాలని మోడీ పిలుపునిచ్చారు. వెంటనే స్పందించిన బిసిసిఐ ఆలస్యం చేయకుండా ఎక్స్ (ట్విట్టర్)లో తన డిపిని త్రివర్ణ పతాకంతో మార్చేసింది. దీంతో బిసిసిఐకి ఊహించని షాక్ తగిలింది. తన వెరిఫికేషన్ బ్లూటిక్‌ను కోల్పోయింది. బ్లూటిక్ లేని బిసిసిఐ ఖాతాను చూసి నెటిజన్లు విస్తుపోయారు.

అంతకుముందు వరకు ఉన్న బ్లూటిక్ ఎందుకు పోయిందా? అని ఆరా తీయగా అసలు విషయం తెలిసి వారూ షాకయ్యారు. ఎక్స్ సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. ఏదైనా ఖాతా ప్రొఫైల్ డీపీ మారిన వెంటనే ఆ ఖాతా బ్లూటిక్ ఎగిరిపోతుంది. ఆ తర్వాత ఆ ఖాతాను ఎక్స్ మేనేజ్‌మెంట్ రివ్యూ చేసి అన్ని మార్గదర్శకాలను అది పాటించినట్టు భావిస్తే అప్పుడు బ్లూ టిక్‌ను పునరుద్ధరిస్తుంది. లేదంటే అంతే సంగతులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News