Thursday, December 19, 2024

పుజారాపై వేటు తప్పదా?

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియా సీనియర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారాపై వేటు పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన డబ్లూటిసి ఫైనల్లో పుజారా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంతో డబ్లూటిసి ఫైనల్లో పుజారాపై టీమిండియా భారీ ఆశలు పెట్టుకుంది. అయితే పుజారా మాత్రం రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన మిస్టర్ డిపెండబుల్ పేలవమైన బ్యాటింగ్‌తో ఉసురుమనిపించాడు.

దీంతో పుజారాను టీమిండియా నుంచి తప్పించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. గవాస్కర్, గంగూలీ, సెహ్వాగ్, గంభీర్ వంటి సీనియర్ క్రికెటర్లు సయితం పుజారాను జట్టు నుంచి తప్పించడమే మంచిదనే సలహా ఇచ్చారు. పుజారా స్థానంలో యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించాలని సూచిస్తున్నారు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, పటిదార్, అభిమన్యు ఈశ్వరన్ వంటి యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించాలని వారు కోరుతున్నారు. మరోవైపు బిసిసిఐ కూడా పుజారాపై వేటు వేసేందుకు సిద్ధమైందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ క్రికెటర్లకు జట్టులో కల్పించాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే పుజారా టీమిండియాకు దూరం కావడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News