- Advertisement -
ముంబై: ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం తర్వాత, ఐపిఎల్ ఆరంభానికి సిద్ధం అవుతుంది బిసిసిఐ. ఈ నేపథ్యంలో బిసిసిఐకి ఊహించని షాక్ తగలింది. గత మూడు సంవత్సరాలుగా జట్టుకు సేవలు అందించిన వైద్య బృంద అధిపతి నితిన్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను ఆయన అధికారికంగా ప్రకటించలేదు. కానీ, బోర్డు వర్గాలు మాత్రం ఆయన రాజీనామాను ధృవీకరించాయి. ‘‘నితిన్ రాజీనామా చేశారు. ఆయనకి బోర్డుతో గొప్ప అనుబంధం ఉంది. ఆయన జట్టు కోసం ఎంతో చేశాడు. సిఒఇలో వైద్య విధానాలు రూపొందించారు. ఎన్‌సిఎకు ఆటగాళ్లు గాయపడి వెళితే.. పూర్తిగా కోలుకోవడమే కాకుండా.. రెట్టింపు ఉత్సాహంతో బయటకు వచ్చేవారు’’ అని బిసిసిఐ వర్గాలు పేర్కొన్నాయి.
- Advertisement -