Friday, March 21, 2025

టీమిండియాకు బిసిసిఐ ఎంత ఇచ్చిందో తెలుసా?

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ లో విజేతగా నిలిచిన టీమిండియాపై భారత క్రికె ట్ బోర్డు కనక వర్షం కురిపించింది. 12 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకున్న భారత క్రికెట్ జట్టుకు బిసిసిఐ భారీ నజరానాను ప్రకటించింది. ఈ మేరకు గురువా రం సోషల్ మీడియా వేదికగా ప్రకటన జారీ చే సింది. టీమిండియా సభ్యులకు రూ.58 కోట్ల నగ దు బహుమతి ఇస్తున్నట్టు బిసిసిఐ వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత జట్టుకు ఐసిసి రూ.19.50 కోట్ల నగదు నజరానాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భారత క్రికెట్ ఐసిసి ప్రైజ్‌మనీకి మూడు రెట్లు అధికంగా నగదు బహుమతిని ప్రకటించడం విశేషం. కాగా, పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News