Monday, January 20, 2025

బిసిసిఐ ఎన్నికల కోసం కసరత్తు

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)లో ఖాళీగా ఉన్న కార్యదర్శి, కోశాధికారి పదవుల భర్తీ కోసం త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ముంబైలో బిసిసిఐ సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోనే ఖాళీగా ఉన్న రెండు కీలక పదవుల ఎంపిక కోసం ఎన్నికలు నిర్వహించాలని బిసిసిఐ భావిస్తోంది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల అధికారిగా అచల్ కుమార్‌ను నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలను సమాచారం పంపించారు. ఇప్పటి వరకు బిసిసిఐ కార్యదర్శిగా కొనసాగిన జైషా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కోశాధికారిగా పని చేసిన ఆశిష్ షెలార్ మహారాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఈ రెండు పదవుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. బిసిసిఐ రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేసిన కార్యవర్గ సభ్యుల స్థానంలో కొత్త వాళ్లను 45 రోజుల్లోపు ఎన్నుకోవాలి. దీంతో బిసిసిఐ ఎన్నికల నిర్వహణ కోసం కసరత్తు ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News