ముంబై: ఐపిఎల్ లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ఏమిటంటే… ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ప్రకారం, ప్రతి ఐపిఎల్ జట్టు మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు వారి ప్రారంభ XIతో(పదకొండు మందితో) పాటు ఐదుగురు ప్రత్యామ్నాయ ఆటగాళ్లను నియమించవచ్చు. మ్యాచ్ సమయంలో, కెప్టెన్ ప్రారంభ XI నుండి ఒక ఆటగాడిని భర్తీ చేయడాన్ని ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అంటారు. ఈ ప్రత్యామ్నాయాలలో ఒకరిని ఎంచుకోవచ్చు.
అయితే ఈ రూల్ ను బిసిసిఐ రద్దు చేసినట్లు ప్రకటించింది. రాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ లో వివాదాస్పద ‘ఇంపాక్ట్ ప్లేయర్’ కాన్సెప్ట్ ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మేలో బిసిసిఐ సెక్రటరీ జే షా ఐపిఎల్ లో ఈ నియమాన్ని ‘ఓ టెస్ట్ కేస్’గా పేర్కొన్నాడు , ఇది శాశ్వతమైనది కాదు ,అయితే ఇది కొనసాగుతుందని కూడా నేను చెప్పడం లేదు” అన్నారు.
ఐపిఎల్ లో 2027 వరకు నియమాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్న కొద్ది రోజులకే ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నియమాన్ని తొలగించాలిన బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ నియమానికి అనుకూలంగా చాలా ఐపిఎల్ ఫ్రాంచైజీలున్నాయి. ఈ రూల్ ని ప్రశంసించేవారు కొందరైతే, విమర్శించే వారు మరి కొందరున్నారు. ఈ రూల్ మంచి చెడు విషయంపై వాద ప్రతివాదనలు కూడా ఉన్నాయి.