రోహిత్‌సేనపై బిసిసిఐ గుర్రు
ముంబై: చెత్త బ్యాటింగ్ టైనప్‌తో సిరీస్‌లో మూడు టెస్టుల్లో ఓడి అపకీర్తి మూటగట్టుకున్న భారత జట్టుపై బిసిసిఐ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. 1969 తర్వాత స్వదేశంలో ఓ ఏడాది అత్యధిక టెస్టులు ఓడటం ఇదే తొలిసారి. అంతేకాదు ఓ జట్టు చేతిలో స్వదేశంలో వైట్‌వాష్ కావడం కూడా ఇ దే ప్రథమం. 148 పరుగుల లక్ష్యాన్ని సాధించలేక ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఈ పరాభావం అనంతరం భారత క్రికెట్ బోర్బు (బిసిసిఐ) కీలక నిర్ంణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం మైదానంలో టీమిండియా కోచ్ గౌత మ్ గంభీర్‌తో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సుదీర్ఘంగా చర్చించాడు. అనంతరం బోర్డు పెద్దలతో అగార్కర్ మాట్లాడాడు.
అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో సహా నలుగురు సీనియర్లపై వేటుకు బోర్డు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లలో కనీసం ఇద్దరిని జట్టు నుంచి తప్పించాలనే నిర్ణమయానికి బిసిసిఐ వచ్చినట్టు తెలుస్తోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు టీమిండియా అ ర్హత సాధించకపోతే ఈ స్టార్ ఆటగాళ్లపై వేటు వే యాలని బోర్డు నిర్ణయించుకుందని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ అనంతరం జరిగే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు సీనియర్లు లేకుండా జట్టును పంపించాలని భావిస్తున్నట్లు పే ర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ఇప్పటికే ఎంపిక చేయడంతో తర్వాత ఇంగ్లండ్‌తో జరగను న్న టెస్టు సిరీస్‌తో మార్పులు చేపట్టనున్నట్లు చెప్పా రు. కాగ, ఈనెల 22 నుంచి ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది.