Monday, December 23, 2024

2023లో ఐదుగురు క్రికెటర్లకు హ్యాండిచ్చిన బిసిసిఐ

- Advertisement -
- Advertisement -

క్రికెటర్లకు, క్రికెట్ అభిమానులకు 2023వ సంవత్సరం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ ఈ ఏడాదే జరిగాయి. టీమిండియా ఆసియా కప్ లో గెలిచి, వన్డే ప్రపంచ కప్ టోర్నీలో రన్నరప్ గా నిలించింది. అయితే కొందరు టాప్ క్రికెటర్ల భవితవ్యాన్ని సందిగ్ధంలో పడేసిన సంవత్సరంగా కూడా 2023 గుర్తుండిపోతుంది. వారెవరో చూద్దాం.

శిఖర్ ధావన్

ఐసిసి టోర్నమెంట్లలో శిఖర్ ధవన్ మొనగాడనే చెప్పాలి. 2021, 22 సంవత్సరాల్లో అతను వన్డే టోర్నమెంట్లకు టీమిండియా కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. అయితే ప్రపంచ కప్ లో మాత్రం అతను స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో బిసిసిఐ శుభ్ మన్ గిల్ ను ఎంపిక చేసింది.

భువనేశ్వర్ కుమార్

బంతిని స్వింగ్ చేయడలో భువనేశ్వర్ కు తిరుగులేదు. కానీ 2023లో అతను టీమిండియా తరఫున బరిలోకి దిగిన దాఖలాలు లేవు. 2022లో జరిగిన కొన్ని మ్యాచ్ లలో డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడంతో, బిసిసిఐ అతన్ని పక్కనపెట్టింది. దీంతో వన్డేలపాటు టీ20లలోనూ అతను స్థానం కోల్పోయాడు.

ఉమ్రాన్ మాలిక్

ఎక్స్ ప్రెస్ పేసర్ గా పేరొందిన ఉమ్రాన్ మాలిక్ 2022లో టీమిండియా జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే 2023లో మాత్రం అతనికి టీమిండియా తరఫున ఆడే అవకాశాలు రాలేదు.

జయంత్ యాదవ్

బ్యాకప్ స్పిన్నర్ గా జయంత్ యాదవ్ కు భారత జట్టులో తరచు స్థానం లభించేది. కానీ తన సత్తా నిరూపించుకునేందుకు అతనికి అవకాశం దొరకలేదు.

వెంకటేశ్ అయ్యర్

వెంకటేశ్ అయ్యర్ ను మరో హార్ధిక్ పాండ్యాగా అందరూ పిలిచేవారు. కానీ 2023లో అతనికి టీమిండియా తరఫున ఆడే అవకాశాలు ఏవీ దక్కలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News