Thursday, January 23, 2025

భారత క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలి: ఆడమ్ గిల్‌క్రిస్ట్

- Advertisement -
- Advertisement -

BCCI should allow Indian players for Foreign leagues: Gilchrist

మెల్‌బోర్న్: భారత క్రికెటర్లను విదేశీ లీగ్‌లలో ఆడే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. విదేశీ లీగ్‌లలో ఒక్క భారత్ తప్ప దేశాల క్రికెటర్లు ఆడుతున్నారని పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు మాత్రం ఆ ఛాన్స్‌ను అందుకోలేక పోతున్నారని తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా భారత క్రికెటర్లకు ఎంతో ఆదరణ ఉందని వారు విదేశీ లీగ్‌లలో ఆడితే ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందన్నాడు. భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సూచించాడు. బిగ్‌బాష్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ లీగ్‌లలో భారత క్రికెటర్లు ఆడితే బాగుంటుందని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో ఆడితే క్రికెట్‌కు మరింత ఆదరణ లభించడం ఖాయమన్నాడు. బిసిసిఐ ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకాన్ని గిల్‌క్రిస్ట్ వ్యక్తం చేశాడు.

BCCI should allow Indian players for Foreign leagues: Gilchrist

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News