ముంబై: సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అభిమానులకు అనుమతి ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కోవిడ్ భయం ఇంకా పూర్తిగా తగ్గక పోవడంతో ఈసారి స్టేడియం సామర్థంలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నట్టు బిసిసిఐ స్పష్టం చేసింది. ఇంగ్లండ్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌ను ఈసారి మూడు స్టేడియాలకు మాత్రమే పరిమితం చేసిన విషయం తెలిసిందే. భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ నాలుగు టెస్టులు, ఐదు టి20లతో పాటు మూడు వన్డేలు ఆడనుంది. కరోనా భయం వల్ల ఈసారి సిరీస్‌ను మూడు నగరాల్లోనే నిర్వహిస్తున్నారు. బయోబబుల్ విధానంలో జరిగే సిరీస్‌లో ఇరు జట్ల క్రికెటర్ల ఆరోగ్యంపై బిసిసిఐ పూర్తి దృష్టి సారించనుంది. మ్యాచ్‌లకు ఆతిథ్యం వచ్చే అన్ని స్టేడియాల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. కిందటి ఏడాది జనవరి తర్వాత భారత గడ్డపై ఒక్క అంతర్జాతీయ సిరీస్ కూడా జరుగలేదు. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే ముగిసిన భారత్‌ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా పరిమిత సంఖ్యలో అభిమానులకు అనుమతి ఇచ్చారు. ఇది విజయవంతం కావడంతో భారత్‌లో కూడా ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని బిసిసిఐ నిర్ణయించింది.
BCCI to Allow 50 percent fans to Ind vs Eng Series