Saturday, November 23, 2024

తుది జట్టులో స్థానం ఎవరిదో?

- Advertisement -
- Advertisement -

BCCI to Need between Pant or Kartik for Asia Cup

ముంబై: ఆసియాకప్‌లో పాల్గొనే టీమిండియాను ఇప్పటికే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్‌లో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్‌లలో ఎవరికీ తుది జట్టులో స్థానం లభిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆసియాకప్‌లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే నాకౌట్ రేసులో నిలిచే అవకాశాలుంటాయి. దీంతో పాక్‌తో పోరును భారత్ సవాల్‌గా తీసుకొంది. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో తుది జట్టు ఎంపిక టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. రిషబ్, దినేష్‌లలో ఎవరినీ తుది జట్టులో ఆడించాలనే దానిపై జట్టు యాజమాన్యం సందిగ్ధంలో పడింది. ఇటీవల కాలంలో ఇద్దరు కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఏ ఒక్కరిని పక్కనబెట్టే పరిస్థితి లేదు. అయితే జట్టు సమతూల్యం కోసం ఒకరిని పక్కనబెట్టక తప్పదు. దీంతో ఎవరిని జట్టుకు దూరంగా ఉంచాలనే దానిపై జట్టు యాజమాన్యం ఎటూ తేల్చుకోలేక పోతోంది. అయితే కార్తీక్‌తో పోల్చితే రిషబ్‌కే తుది జట్టులో అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

BCCI to Need between Pant or Kartik for Asia Cup

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News