Saturday, November 16, 2024

టీమిండియాకు కొత్త జెర్సీ

- Advertisement -
- Advertisement -

BCCI unveils Team India's new jersey

 

ముంబై: యుఎఇ వేదికగా జరిగే ట్వంటీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియా కోసం భారత క్రికెట్ బోర్డు కొత్త జెర్సీని సిద్ధం చేసింది. నయా జెర్సీలు ధరించిన టీమిండియా క్రికెటర్లు ఫొటోలను బిసిసిఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. బిలియన్ చీర్స్ జెర్సీని ఆవిష్కరిస్తున్నామని, దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని రూపొందించామని బిసిసిఐ ఈ ట్వీట్‌కు క్యాప్షన్ పెట్టింది. ఇటీవల కాలంలో భారత క్రికెటర్ల జెర్సీ తరచూ మారుతూ వస్తోంది. గతంలో ఉన్న జెర్సీలనే స్వల్ప మార్పులతో తయారు చేశారు. ఈసారి కలర్ డోస్‌ను పెంచారు. మెన్ ఇన్ బ్లూ కాస్త..ధిక్ బ్లూగా మారింది. నేవీ బ్లూ కలర్‌లో కొత్త జెర్సీని రూపొందించారు. జెర్సీ ముందు భాగంలో రాయల్ బ్లూ కలర్ షేడ్స్ ఉన్నాయి. దానిపై టీమిండియా కిట్ స్పాన్సర్‌లు ఎమ్‌పిఎల్ స్పోర్ట్, బైజూస్ సంస్థల పేర్లు తెల్లని రంగులో కనిపిస్తున్నాయి. ఇక ఇండియా పేరును ఆరెంజ్ కలర్‌లో ఉంచారు. జెర్సీ ఎడమ భాగంలో బిసిసిఐ లోగోతో పాటు కొత్తగా మూడు చుక్కలు కనిపిస్తున్నాయి. టీమిండియా సాధించిన మూడు ప్రపంచకప్ ట్రోఫీలకు గుర్తింపుగా ఈ చుక్కలను ఉంచారు. ఇక వరల్డ్‌కప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News