Saturday, November 23, 2024

ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: వెస్టిండీస్‌తో సొంత గడ్డపై జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ) నిర్ణయించింది. ఈ విషయాన్ని సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్న గుజరాత్ క్రికెట్ సంఘం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. కరోనా తీవ్రత పూర్తిగా తగ్గక పోవడంతో క్రికెట్ మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులకు అనుమతి ఇవ్వడం లేదని వివరించింది. కొంత కాలంగా దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఇలాంటి స్థితిలో అభిమానుల సమక్షంలో క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహిస్తే ప్రతికూల పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. దీంతో ఖాళీ స్టేడియాల్లోనే వన్డే సిరీస్‌ను నిర్వహించాలని బిసిసిఐ అధికారులు నిర్ణయించారు. ఇక వెస్టిండీస్‌భారత్ జట్ల మధ్య మూడు వన్డేలు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నిలువనుంది. ఫిబ్రవరి ఆరున తొలి వన్డే జరుగనుంది. చివరి వన్డే ఫిబ్రవరి 11న జరుగుతుంది. ఇక విండీస్‌తో జరిగే తొలి మ్యాచ్ టీమిండియాకు 1000వ వన్డే కావడం విశేషం. ఈ చారిత్రక మ్యాచ్‌ను స్వయంగా వీక్షించాలని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది.
టి20 సిరీస్‌కు మాత్రం..
మరోవైపు విండీస్‌తో జరిగే టి20 సిరీస్‌ను మాత్రం ప్రేక్షకుల సమక్షంలో నిర్వహిస్తారు. టి20 మ్యాచ్‌లను చూసేందుకు బెంగాల్ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో టి20 సిరీస్ 75 శాతం మంది ప్రేక్షకుల సమక్షంలో జరుగనుంది. ఇక, ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. కోల్‌కతా వేదికగా ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

BCCI will not allow to fans for IND vs WI ODI Series

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News