Tuesday, January 21, 2025

20న టీమిండియా ఎంపిక?

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ వన్డే టోర్నమెంట్ కోసం టీమిండియా ఎంపిక ఆగస్టు 20న జరుగుతున్నట్టు తెలిసింది. పాకిస్థాన్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆసియాకప్‌కు విపరీత ప్రాధాన్యత సంతరించుకుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌లు ఒకటే గ్రూపులో ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఇదిలావంటే వరల్డ్‌కప్‌కు ముందు జరుగుతున్న అతి పెద్ద ట్రోఫీ కావడంతో ఆసియాకప్ అన్ని జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది.

భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లకు ఇది కీలకంగా తయారైంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపికపై అందరిదృష్టి నెలకొంది. సీనియర్లు కోహ్లి, రోహిత్, జడేజా, బుమ్రా, అశ్విన్, రాహుల్ తదితరులు జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, 20న జట్టును ఎంపిక చేసేందుకు బిసిసిఐ కసరత్తు ప్రారంభించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News