Monday, January 20, 2025

బిసిలకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని బిసిలకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం నాగేశ్వర రావు ప్రశ్నించారు. శనివారం కల్వకుర్తి ఆర్ అండ్ బి అతిథి గృహంలో 15న హైదరాబాద్‌లో జరిగే బిసి ప్లీనరి బహిరంగ సభ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బిసిలకు రాబోయే ఎన్నికల్లో 60 సీట్లు ఇవ్వాలని బిసిని ముఖ్యమంత్రి చేయాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లకు ఒకే ఒక బిసి ఉన్నాడని అన్నారు. బిసి జనాభా ప్రకారం బిసిలకు నాలుగు అసెంబ్లీ సీట్లు ఇవ్వాలన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు మాత్రమే బిసి ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. అలాగే ఉన్న రెండు ఎమ్మెల్సీలు అగ్రకులాలకు ఇవ్వడం బిసిలకు అన్యాయం చేయడమేనని స్పష్టం చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బిసిలకు అన్ని రాజకీయ పార్టీలు 8 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని లేదంటే ఈ అగ్రకుల పార్టీలను బొంద పెడుతామని హెచ్చరించారు.

ఏ రాజకీయ పార్టీ బిసిలకు 60 సీట్లు ఇచ్చి బిసి ముఖ్యమంత్రి ప్రకటిస్తారో ఆ పార్టీకి బిసిలు మద్ధతు ఇస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యద్శి రమేష్ చారి, బిసి యువజన సంఘం రాష్ట్ర బొడ్డుపల్లి సంజీవ్, చెన్నం బాలయ్య ముదిరాజ్, ముద్దునూరి రాజు, గొడుగు భగవంతు గౌడ్, రామ్ సాగర్, దేవర మధు, ఎం. శ్రీను గౌడ్, రవి యాదవ్, మత్తమల్ల బాలు, తాళ్ల సురేష్ గౌడ్, పాల శ్రీనివాస్ యాదవ్, గుడ్ల నర్వ కరుణాకర్, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News