Monday, January 20, 2025

బిసిలకు రక్షణ లేకుండాపోయింది: సుమన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బిసిలకు రక్షణ లేకుండా పోయిందని సినీ నటుడు సుమన్ తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ జరిగింది. బాపట్లలో జిల్లాలో పదో తరగతి విద్యార్థిని చంపితే చర్యలు లేవని మండిపడ్డారు. ఎపిలో కులానికొక పార్టీ ఉందని, బిసిలకు పార్టీ లేదన్నారు. బిసిలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకి మద్దతివ్వాలన్నారు. మేలు చేసే పార్టీల వద్దకే బిసిలు వెళ్లాలన్నారు. బిసిలకు ఎక్కువ సీట్లు ఇచ్చినందుకే కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, గౌతు శిరీష పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News