Sunday, December 22, 2024

చట్టసభల్లో బిసిల రిజర్వేషన్ల అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

మహిళా బిల్లు ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

మన తెలంగాణ/ హైదరాబాద్: దేశ జనాభాలో మెజారిటీ గా ఉన్న బిసిల లెక్క తేల్చకుండా, చట్టసభలలో బిసిలకు ప్రాతినిధ్యం కల్పించకుండా మహిళా బిల్లు ప్రవేశపెట్టాడాన్ని భారత యాదవ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ది రమేశ్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. శనివారం ఓయూలో విద్యార్థి నాయకులు సిరిమల్లె అశోక్ యాదవ్ తో కలిసి మహిళా బిల్లు ప్రతులను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మహిళా బిల్లు ఈడబ్లూఎస్ రిజర్వేషన్ లాంటిదేనని, చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా రిజర్వేషన్‌లలో బిసిల వాటా తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ యాదవ్, జోశ్న నాయక్, శరత్ యాదవ్, ఉస్మానియా విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News