Sunday, December 22, 2024

బిసిలకు ఉపముఖ్యమంత్రితోపాటు ఐదు మంత్రి పదవులివ్వాలి : ఆర్.కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బిసిలకు అనేక వాగ్దానాలు చేశాయని ముఖ్యమంత్రి ఈ వాగ్దానాలు అమలు చేస్తారనే ఆశాభావాన్ని కృష్ణయ్య వ్యక్తం చేశారు. గత మంత్రి వర్గ నిర్మాణంలో బిసిల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని. వచ్చే విస్తరణలో బిసిలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానన్నారు. త్వరలో భర్తీ చేయబోయే కార్పొరేషన్‌లు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలలో ఇతర నామినేటెడ్ పోస్టులలో బిసిలకు జనాభా దమాషా ప్రకారం 50 శాతం పదవులు ఇవ్వాలని కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో సమర్థులైన బిసి నాయకులున్నారని, వారి సేవలు గుర్తించి పదవులు ఇవ్వాలని కోరారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిసిలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ హయంలో బిసిలకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందన్నారు. బిసి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వలేదని, పంచాయితీ రాజ్ సంస్థలలో రిజర్వేషన్లు 34 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారని తెలిపారు. ప్రేవేటు యూనివర్సిటీలలో బిసి, ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు ఎత్తివేశారని తెలిపారు. ఫీజు రియింబర్స్ మెంట్ కు బడ్జెటు ఇవ్వలేదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బిసిలకు పెద్ద యెత్తున అన్యాయం జరిగిందనే కోపంతో ఎన్నికలలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామన్నారు. గతంలో బిసిలకు జరిగిన అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో జరుగరాదని చెప్పారు. రాహుల్ గాంధీ బిసిలకు చేసిన వాగ్దానాలు, ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలని కోరారు. ఇటీవల నలుగురు ప్రభుత్వ సలహాదారులలో ఒక్కరూ కూడా బిసిలు లేరని, బిసి సంక్షేమ శాఖలో కమిషనర్ లేక కుంటు పడుతుంధన్నారు. వచ్చే బడ్జెట్‌లో బిసిలకు 20వేల కోట్ల కేటాయించాలని, ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని, బిసి బందు పథకం ప్రవేశపెట్టి ప్రతి బిసి కుటుంబానికి 20 లక్షల మంజూరు చేయాలని కోరారు. మంత్రి వర్గంలో 50 శాతం కోటా ఇవ్వాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News