Wednesday, January 22, 2025

బిసిలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి

- Advertisement -
- Advertisement -

BCs should be granted Subsidy loans: Krishnaiah

ముఖ్యమంత్రికి కృష్ణయ్య వినతి

హైదరాబాద్ : బిసి కార్పొరేషన్, 12 బిసి ఫెడరేషన్లకు బడ్జెట్ విడుదల చేసి వీటి ద్వారా వెంటనే బిసిలకు సబ్సిడి రుణాలు మంజూరు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విజ్ఞప్తి చేశారు. బిసి కులాల ఐక్యవేదిక అధ్యక్షులు అనంతయ్య అధ్యక్షతన బుధవారం బిసి భ వన్‌లో బిసి కులాల సమావేశం జరిగింది. దాదాపు 36 బిసి కులాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ సబ్సిడి రుణాల కోసం ఐదేళ్ళ క్రితం 5 లక్షల 77 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రతి దరఖాస్తు దారుడికి రుణాలు ఇస్తామని 2017లో వాగ్దానం చేశారని కృష్ణయ్య గుర్తు చేశారు. రాష్ట్రంలో 60 లక్షల బిసి కుటుంబాలు ఉంటే కేవలం 5 లక్షల 27 వేల మంది మాత్రమే సబ్సిడి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరికి కూడా రుణాలు ఇవ్వరా అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిసి కార్పొరేషన్, బిసి ఫెడరేషన్లకు నిధులు లేక ఉత్సవవిగ్రహాలుగా మారాయని, అక్కడి సిబ్బందికి పనిలేకుండా పోయిందని పేర్కొన్నారు. వెంటనే బిసిలకు రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కృష్ణయ్య కోరారు.

వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా తరుణ్ వంశీ నియామకం

బిసి యువజన సంఘం వికారాబాద్ జిల్లా అధ్యుక్షులుగా ఆనెమోని తరుణ్ వంశీ యాదవ్ నియమితులయ్యారు. విద్యానగర్‌లోని బిసి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్. కృష్ణయ్య తరుణ్ వంశీ యాదవ్‌కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బిసి యువజన సంఘాన్ని పటిష్ఠం చేయాలని సూచించారు. బసి లందరు సంఘటితంగా ఉండాలని, రాజ్యాధికారం కోసం పోరాడాలన్నారు. తరుణ్ వంశీ యాదవ్ మాట్లాడుతూ తనను నియమించిన బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు ఆర్. కృష్ణయ్యకు, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బిసి నాయకులు నీల వెంకటేష్, గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణ, పి.సుధాకర్, కోల జనార్ధన్, సి. రాజేందర్, జి. అనంతయ్య, వేముల రామకృష్ణ, మల్లేష్ యాదవ్, నికిల్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News