- Advertisement -
షిల్లాంగ్: మేఘాలయ నూతన గవర్నర్‌గా బిడి మిశ్రా మంగళవారం ఇక్కడి రాజ్‌భవన్‌లో పదవీ స్వీకారం చేశారు. భారత సైన్యంలో బ్రిగేడియర్‌గా పనిచేసి పదవీ విరమణ అనంతరం 2017 నుంచి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్న మిశ్రా పొరుగు రాష్ట్రమైన మేఘాలయ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 3వ తేదీన మేఘాలయ గవర్నర్‌గా పదవీకాలం పూర్తి చేసుకున్న సత్యపాల్ మాలిక్ స్థానంలో మిశ్రా నియమితులయ్యారు. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రడ్ కె సంగ్మా నూతన గవర్నర్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మెట్బా లింగ్డో, సీనియర్ క్యాబినెట్ మంత్రులు పాల్గొన్నారు.
- Advertisement -