Friday, December 20, 2024

పని ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : ఏరియాలోని జెకె 5 ఉపరితలగనిని జిఎమ్ సేఫ్టీ కొత్తగూడెం రీజియన్ కుమారస్వామి గురువారం స్థానిక అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రోజువారి ఉత్పత్తి, రవాణా, ఓబి వెలికితీసే వివరాలను ప్రాజెక్ట్ ఆఫీసర్ బొల్లం వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్వారీలోని పని ప్రదేశాలను అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి మాట్లాడారు.

ఉద్యోగులందరూ పని ప్రదేశాలలో అప్రమత్తంగా వుండాలని, ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. సంస్థ నిర్ధేశించిన ఉత్పత్తిని రక్షణతో సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ పూర్ణచందర్, సేఫ్టి ఆఫీసర్ శివప్రసాద్, ఇంజనీర్ దేవేందర్‌నాయక్, మైన్ సర్వే అధికారులు నాగేశ్వరరావు, శ్రీనివాస్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News