Friday, December 20, 2024

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: వర్షాలు, వాతావరణంలో సంభవించే మార్పులతో ప్రబలే వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ సూచిం చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ స మీక్షించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాలు ప్రారంభమై వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో సీజనల్ వ్యాదులు, జ్వరాలు సంబవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున జిల్లాలో ఉన్నటువంటి అన్ని పల్లే దవాఖానాలలో అవసరమైన అన్ని మందులతో కూడిన సీజనల్ డిసిజస్ కిట్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విదంగా రూరల్ ప్రాంతాల్లో వానలకు పాములు సంచరించే అవకాశాలు ఎ క్కువగా ఉన్నందున యాంటి స్నేక్ కిట్ లను కూడా అందుబాటులో ఉంచాలన్నారు.

రానున్న సోమవారం నుండి జిల్లాలో ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు డ్రైడే కార్యక్రమాలను , ర్యాపిడ్ ఫీవర్ సర్వే కార్యక్రమాలను నిర్వహించాలని , ఆదివారం ఉదయం 10 గంటలకు, 10ని.ల పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు మరియు కమ్యూనిహాల్ లలో డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలన్నా రు. గ్రామాల్లో నిర్వహించె డ్రై డే కార్యక్రమాల్లో వైద్యాధికారులతో పాటు పంచాయితి సెక్రటరీలును కూడా భాగస్వాములను చేయాలని, మున్సి పల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమీషనర్లు సీజనల్ వ్యాదులు ప్రబల కుండా నీరు నిలువ ఉన్నచోట అయిల్ బాల్స్ వేయడం, ఫాగింగ్ చేపట్టడం వం టి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.

మెడికల్ ఆఫీసర్లందరు ఉదయం 9 నుండి సాయత్రం 6 గంటల వరకు ఆరోగ్యకేంద్రా ల్లో ఆందుబాటులో ఉండాలని, ఆరోగ్య కేంద్రాలలో అన్ని మందులు, సెలయిన్లు, ర్యాపిడ్ డయోగ్నస్టిక్ కిట్ లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. డెంగ్యూ వ్యాదిపై అప్రమత్తంగా ఉండాలని, డయోగ్నస్టిక్ కేంద్రాలు డెంగ్యూపై పూర్తి స్పష్టత వచ్చే వరకు వ్యాదిని నిర్దారించకూడద ని, డెంగ్యూగా నిర్దారణ జరిగినట్లయితే మొదటగా జిల్లా వైద్యాదికారికి, మెడికల్ అధికారి తెలియజేయాలని, డెంగ్యూ నిర్దారణ జరిగిన ప్రాం తాల్లో తక్షణ చర్యలను చేపట్టి మెడికల్ క్యాంపులను నిర్వహించాలని, పరిసరాల పరిశుభ్రతను చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

అంగన్ వాడి కేంద్రాల్లొ కాచి చల్లార్చిన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమలు వృద్ది చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అయిల్ బాల్స్ వేయడం, ఫాగింగ్ చేయించడం వంటివి చేపట్టాలని సూచించారు. అంగన్ వాడి సూపర్ వైజర్లు ప్రత్యేక చొరవ చూపించాలని తెలిపారు. వందశాతం ఎఎన్సి రిజిస్ట్రేషన్ జరగాలని, పిహెచ్సి వారిగా అనిమియా పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి మందులను ఆందించాలని తెలిపారు. జిల్లాలొ అంగన్ వాడి కేంద్రాల్లో ఆరోగ్య సమస్యలున్న సామ్, మామ్ పిల్లలతో పాటు ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా బాలామృతం ప్లస్ ను అందించాలన్నారు.

ఎట్టి పరీస్థితుల్లో ఇంటికి బాలామృతం ప్లస్ ఇవ్వకూడదని, అవసరమైతె అదనంగా మరికొంత అక్కడె తినడానికి ఇవ్వాలని తెలిపారు. బిఎల్‌ఓ గా విధులు నిర్వహించే అంగన్ వాడి సిబ్బందికి ఎన్నికల పనిని కేటాయించి నందున వారికి మినహయింపునివ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లలితాదేవి, డిపిఓ వీరబుచ్చయ్య, మున్సిపల్ కమీషనర్ సేవాఇస్లావత్, మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణ ప్రసాద్, డిడబ్ల్యుఓ సంద్యారాణి, సిడిపిఓ సబితా కుమారి, వైద్యాధికారులు, అంగన్ వాడి సూపర్ వైజర్లు, ప్రోగ్రాం అధికారు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News