Sunday, January 19, 2025

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు

=సిద్దిపేట: చెత్త, ప్లాస్టిక్ ర హిత పట్టణ నిర్మాణానికి అందరు సహకరించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నా రు. గురు వారం స్వచ్ఛ సిద్దిపేట నిర్మాణంలో భాగంగా ప్రతిరోజు ఒక వార్డు చోప్పున చేపట్టిన కా ర్యక్రమం నడుస్తూ చెత్త వేరుచేయుల కార్యక్రమంలో 40 వార్డులో వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, కౌన్సిలర్ తాడూరి సాయి ఈశ్వర్ గౌడ్ తో కలిసి వార్డులో నడుస్తూ చె త్తను సేకరించించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ప్రతి రోజు చెత్తను సేకరించే మున్సిపల్ వా హనం క్రమం తప్పకుండా వస్తుందా లేదా అని ప్రజలను అడిగారు. చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహానాలకు అందించే పద్దతిని పరిశీలించారు.

అలాగే గల్లీలలో రోడ్ల పక్కన పెరిగినటువంటి పిచ్చి గడ్డిని తొలగించాలని చెప్పారు. వర్షాకాలం కాబట్టి వార్డులో శిథిలావస్ధ ఇండ్లలో ఎవరైనా ఉంటే ఆటువంటి వారు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. వార్డు ఆఫీసర్లు, సంబంధిత ఎఈలు వార్డులలో పర్యటించాలన్నారు. పట్టణంలో ప్లాస్టిక్ వాడకం పట్ల ఆరుబయట చెత్త, ఇండ్లలో చెత్త వేరు చేయుటపై ప్రజలకు ప్రతి రోజు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. సిద్దిపేట పట్టణంలో చెత్త సేకరణ అనేక కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని అన్నారు. ప్రజలలో మరింత మార్పు రావాలని అప్పుడే పట్టణం మరింత అందంగా కనిపిస్తుందన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డులో ప్లెక్సీ పట్టుకొని స్వచ్ఛ సిద్దిపేటలో అందరు బ్యాగస్వాములు కావాలంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు మరింత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News