గుండాల : సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని మండల వైద్యాధికారి మనీష్ రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సదస్సు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ…వర్షాకాల సీజన్ ప్రారంభమైనందున నీటి నిలవలలో దోమలు పరిగి దోమ కాటు వలన డెంగీ, మలేరియా, బోదకాలు, చికన్ గున్యా వంటి విష జ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నందున వివిధ శాఖల అధికారులు సమన్వయంతో గ్రామాలలో పారిశుద్ద కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అంతేకాకుండా వారానికి రెండు సార్లు డ్రైడె కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.
అలాగే ప్రాథమిక వైద్య కేంద్రంలో మలేరియా టెస్టులతో పాటు కొత్తగా డెంగ్యు నిర్ధారణ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కావున జ్వర లక్షణాలు ఉన్నవారు ఆస్పత్రికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతేకాకుండా జన ఆరోగ్య సమితి (జేఎసి) కమిటీని నియమించారు. ఈనెల 20 తేదిన (ఎన్‌డిడి) నేషనల్ డి వార్మింగ్ డే ని విజయవంతం చేయాలని వారు కోరారు. అలాగే నూతనంగా మంజూరైన పోస్టుమార్టం నిర్మాణ స్థల నేకరణ కోసం చర్చించగా త్వరలో మండల కేంద్రంలో స్థలం చూపిస్తామని తాహసీల్ధార్ నాగ దివ్య హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ముక్తి సత్యం, ఉపసర్పంచ్ మానాల ఉపెందర్, ఎంపివో హజ్రత్ వాలీ, సిహెచ్‌వో శ్రీహారి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ సత్యం, గ్రామస్తులు లాలయ్య, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.