- Advertisement -
లింగాల: ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెల్త్ అసిస్టెంట్ రామ్ చందర్ అన్నారు. శుక్రవారం లింగాల మండల పరిధిలోని ఔసలి కుంట గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీరు నిల్వ ఉండడం వలన దోమల వృద్ధి చెంది జ్వరాలు వస్తున్నాయన్నారు.
వంట పాత్రలు ప్లాస్టిక్ డబ్బాలు, కొబ్బరి బొండా చిప్పలు, సీసాలు, టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, గ్రామ పంచాయతి చెత్త వాహనం వచ్చినప్పుడు అందులో వేయాలన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకుని సీజనల్ వ్యాధుల భారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మల్లేష్, సర్పంచ్ బండి ఎల్లయ్య, పంచాయతీ కార్యదర్శి చంద్రయ్య, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -