Monday, December 23, 2024

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

– సైబర్ నేరగాళ్లు చేతిలో పోగొట్టుకున్న రూ.19 లక్షలు రికవరీ

నల్గొండ : సైబర్ నేరగాళ్ల చేతిలో ఆన్ లైన్ మార్కెటింగ్ ప్రొడకట్స్ ద్వారా పోగొట్టుకున్న డబ్బును తిరిగి రికవరీ చే సిన సైబర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు. ఆన్ లైన్ మార్కెటింగ్ ప్రొడకట్స్ లలో తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక మొత్తంలో డబ్బు పొందవచ్చని ఆశ చూపించే మోసపూరితమైన సైబర్ నేరగాళ్లు పట్ల అప్రమత్తం గా ఉండాలని మంగళవారం జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. కనగల్ మండల కేంద్రానికి చెందిన గొట్టిగోర్ల అవినాష్‌కి వాట్స్ అప్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు అన్ లైన్ మార్కెటింగ్ ప్రొడక్ట్ అని మెసేజ్ పంపించి తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక మొత్తంలో లాభాలు వస్తాయని మభ్య పెట్టగా మొదటగా రూ.50 వేల పెట్టుబడి పెట్టగా కొన్ని ప్రొడక్ట్స్ పంపగా వాటిని విక్రయించాడని, దానికి కొంత ఎక్కువ డబ్బులు ఇచ్చి ఆశ చూపించి ఎక్కువ డబ్బులు పెట్టే విధ ంగా నమ్మకం కలగజేయగా అతను ఇలా మొత్తం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టడం జరిగిందని, అతని యాప్ లో రూ.90 లక్షలు కనిపిస్తున్నాయని, కానీ వాటిని డ్రా చేయడానికి వీలు కాకుండా ఉండగా అప్పుడు మోసపోయామని గమనించి సదరు వ్యక్తి వెంటేనే సైబర్ క్రైమ్ పోలీసులు పిర్యాదు చేయగా ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసి సైబర్ నేరగాని అకౌంట్ ను ప్రిజ్ చేసి రూ.19 లక్షల రికవరీ చేయడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మెసేజ్ లు క్లిక్ చేయకూడని, నకిలీ వెబ్ సైట్ల ద్వారా అమాయకులను నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు లాగేస్తున్నారన్నారు. వైద్య సహాయం, పేరు పొందిన కంపెనీలలో ఉద్యోగాల పేరుతో సులభంగా నమ్మే మోసాలను ఎంచుకొని మోసాలు చేస్తున్నారని, లోన్ యాప్ అంటూ సులభంగా లోన్లు ఇస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ డేటా మొత్తం తమ అధీనం లోకి తీసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎవరు అలాంటి యాప్ లను డౌన్లోడ్ చేయకూడదని, ఎవరైనా ఇలాంటి మోసాలకు గురి అయితే వెంటెనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని, హెల్ప్ లైన్ నంబర్ 1930 కానీ 155260 కి కాల్ చేసి తెలియజేయాలని సూచించారు. టెక్నాలజీ ఉపయోగించి రికవరీ చేసిన సైబర్ క్రైమ్ యస్‌ఐ వీర శేఖర్, కానిస్టేబుల్ మొక్షిద్ లను జిల్లా ఎస్పి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News