Monday, December 23, 2024

వరస వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి: మేయర్ అదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్‌లో వరసగా వర్షాలు కురుస్తుండడంతో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. వర్షాల కారణంగా ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా జోనల్ కమిషనర్లు, సూపరిండెంట్ ఇంజనీర్లు, ఈవిడిఎంతో పాటు మాన్సూన్ బృందాలు పూర్తి ప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించిన వర్షాల కారణంగా ఈ సమస్యను వచ్చినా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించేలా ఈ విడిఎం బృందాలు ఎప్పుడూ సిద్దంగా ఉండాలన్నారు.

రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో సర్కిళ్ల వారిగా డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌ఓలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల నుండి ప్రమాదాలు చోటు చేసుకోకుండా జోనల్,సర్కిల్ , వార్డ్ స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఇందుకు మేయర్ పలు సూచనల చేశారు. వార్డు టౌన్ ప్లానర్లు సంబంధిత వార్డులను పరిశీలించి శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు, కొనసాగుతున్న సెల్లార్ పనులను గుర్తించి సంబంధిత ఎసిపికి వెంటనే నివేదించాలని సూచించారు. శిథిలమైన నిర్మాణాలను కూల్చివేయడం సాధ్యం కాకపోతే వెంటనే వాటిల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి ప్రాణ నష్టం చోటు చేసుకోకుండా భవనాన్ని మూసివేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనుమతుల మేరకు సెల్లార్ పనులు కొనసాగుతున్న సందర్భంలో భారీ వర్షాలు కురిసినప్పుడు మట్టి జారడం , పొరుగు నిర్మాణాలు దెబ్బతినే అవకాశం ఉండడంతో అన్ని భద్రతా చర్యలు ఖచ్చితంగా పాటిస్తున్నారా లేదా అని నిర్ధారింకోవడంతో పాటు వర్ష కాలం ముగిసే వారకు కొత్త సెల్లార్ తవ్వకాలను అనుమతి ఇవ్వరాదని తెలిపారు.

అదేవిధంగా కంట్రోల్ రూమ్, ఐఎండి, కాల్ సెంటర్ (040-21111111)ల ద్వారా అందుతున్న అన్ని ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాలన్నారు. జోనల్ సీపీలు సైతం వారి సంబంధిత సర్కిల్‌లను పర్యవేక్షిoచి , సిబ్బందిని సకాలంలో అప్రమత్తం చేయాలని తెలిపారు. ఈ సూచనలను ఖచ్చితంగా పాటించాలి, ఏలాంటి నిర్లక్షం వహించినా సంబంధిత అధికారులు , సిబ్బందిపై చర్యలు తప్పవని మేయర్ హెచ్చరికలను జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News