Monday, December 23, 2024

అందుబాటులో ఉంటూ సేవలందించాలి

- Advertisement -
- Advertisement -
  • నూతన పాలక వర్గానికి సూచన
  • మార్కెట్ పాలకవర్గాన్నీ సన్మానించిన ఎమ్మెల్యే రసమయి

బెజ్జంకి: మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతులకు ఎల్లప్పు డూ అందుబాటులో ఉంటూ సేవాలందించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కమిటీ సభ్యులకు సూచించారు. మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం బాధ్యతలు స్వీకరించిన అనంతరం చెర్మెన్ కచ్చు చెంద్రకళ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చెర్మెన్, పాలక వర్గాన్ని ఎమ్మెల్యే శాలవతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ చెర్మెన్ కచ్చురాజయ్య, నాయకులు లక్ష్మణ్, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News