- Advertisement -
రాజంపేట: సైబర్ నేరాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట ఎస్‌ఐ రాజు సూచించారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులకు సంబందించిన వివరాలు ఎవరికి ఇవ్వవద్దని అలాగే తమ ఫోన్‌లకు వచ్చే ఓటిపిలు ఇతరులకు చెప్పరాదని తమకు సంబందించిన వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుకోవాలని అయన సూచించారు. ఇటీవల అనేక చోట్ల పలు రకాల మోసాలు జరుగుతున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. మోసం జరిగాక గ్రహించడం కంటే జరగక ముందే అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని ,ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే కేవైసీలను అప్‌డేట్ చేయమని వచ్చే మెసేజ్‌లను నమ్మకుడదన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 నెంబర్‌కు డయల్ చేయలన్నారు. సైబర్ క్రైం గురైనప్పుడు వెంటనే పిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందని అన్నారు.
- Advertisement -