Monday, December 23, 2024

అకాల వర్షాలపై జాగ్రత్తగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : అకాల వర్షాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పుర చైర్మెన్ ఎడ్మ సత్యం అన్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు కల్వకుర్తి పట్టణ పరిధిలోని వివిధ కాలనీలలో ఉన్న లోతట్టు ప్రాంతాలలో వర్షం నీరు నిలిచింది. ఆదివారం పుర చైర్మెన్ ఎడ్మ సత్యం వార్డు కౌన్సిలర్లు, సిబ్బందితో కలిసి వార్డులలో పర్యటించి సమస్యలను పరిశీలించారు.

అనంతరం తక్షణ చర్యల కింద మున్సిపల్ సిబ్బందితో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎల్లికల్ రోడ్డు గండి దగ్గర వర్షం నీరు మల్లుకున్న విషయం గమనించి జేసిబితో తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News