చిలిపి, చిల్లర చేష్టలు వద్దు
అహంకారం వీడి కార్యకర్తలను అందరినీ కలవండి
జూపల్లి కృష్ణారావు ఓటమే ఓ పాఠం
బిఫారాలు నింపడంలో జాగ్రత్తలు తీసుకోండి
అనుమానాలు ఉంటే న్యాయవాది భరత్ కుమార్‌ను సంప్రదించండి
సాంకేతిక కారణాలతో మనపై కుయుక్తులకు విపక్షాల కుట్రలు
అవకాశం రానివారు తొందరపడొద్దు.. మున్ముందు అవకాశాలు కల్పిస్తాం
బిఆర్‌ఎస్ అభ్యర్థులకు అధినేత కెసిఆర్ దిశానిర్దేశం
69మందికి తెలంగాణ భవన్, ప్రగతి భవన్‌లో బిఫారాలు అందజేత, నేడు మిగతా వారికి…
రాజకీయాలన్న తర్వాత మంచి, చెడులతో పాటు అలకలూ ఉంటాయి. అభ్యర్థులకు సంస్కారం ఉండాలి. మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. అందరి కంటే ఎక్కువగా అభ్యర్థులు ప్రజల్లో ఉండాలి.. కోపాలు తీసేసుకోవాలి. చిన్న కార్యకర్తతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి. దీనిని ప్రతిఒక్కరూ తప్పకుండా పాటించాలి. గత ఎన్నికల సందర్భంగా వ్యక్తిత్వం మార్చుకోవాలని ఒకరిద్దరికి చెప్పా. అయినా వారు తమ తీరు మార్చుకోకుండా కార్యకర్తలతో మాట్లాడలేదు. అందుకే ఒకరు ఓడిపోయారు. జూపల్లి కృష్ణారావు అని ఒకాయన ఉండే.. మంత్రిగా పని చేశారు. ఆయన అహంకారంతో ఇతర నాయకులతో మాట్లాడలేదు. ఎన్నికల్లో ఓడిపోయారు. అభ్యర్థులు ప్రజల్లో ఉండకపోతే ప్రజల తీర్పు అలా ఉంటది. ఒక మనిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకు? నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. చిలిపి పనులు, చిల్లర పనులతో ఎన్నో కోల్పోతారు. సంస్కారవంతంగా ఉండాలి. – సిఎం కెసిఆర్