Friday, November 22, 2024

రాబోయే 3 నెలలు జాగ్రత్తగా ఉండండి

- Advertisement -
- Advertisement -

Be careful for the next 3 months Dr VK Paul said

పండగల దృష్టా కొవిడ్ కేసులు పెరక్కుండా చూసుకోండి
కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, కేరళలో కూడా కేసుల తగ్గుదల కనబడుతోందని కేంద్రం గురువారం వెల్లడించింది. అయితే రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాబోయే మూడు నెలలూ పండగల సమయం. అలాగే ఫ్లూ కేసులు పెరిగే కాలం గనుక ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వికె పాల్ కోరారు. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు కరోనా కట్టడిలో సాధించిన ఫలితాలను మరింత మెరుగుపర్చుకుందామని వారు ఈ సందర్భంగా కోరారు. దేశవ్యాప్తంగా యువ జనాభాలో ఇప్పటివరకు 20 శాతం మందికి రెండు డోసులు పంపిణీ పూర్తయిందని, అలాగే 62 శాతం మందికి కనీసం ఒక్క డోసు అందినట్లు తెలిపారు.

34 జిల్లాల్లో 10 శాతంకన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు

దేశంలోని 34 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా ఎక్కువగా ఉండగా, 32 జిల్లాల్లో మాత్రం 5నుంచి 10 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. గత వారం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 67.79 శాతం కేసులు ఒక్క కేరళలోనే వచ్చాయని, ప్రస్తుతం అక్కడ 1.99 లక్షల యాక్టివ్ కేసులున్నట్లు వివరించారు. మిజోరం, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో 10 వేలకన్నా ఎక్కువ యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. మిజోరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్ త్వరగా జరిగి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా పరిస్థితి చక్కబడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

అనవసర ప్రయాణాలు మానుకోండి

పండగల సీజన్ వస్తుండడంతో వ్యాక్సిన్ తీసుకోవడం, కరోనా నిబంధనలు పాటించడం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడంలాంటివి చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ అన్నారు. కేరళలో ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని తెలిపారు. పండగల సీజన్‌లో తగు జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కరోనా కేసులుఅకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News